కరోనా ఏ ఒక్కర్నీ వదిలి పెట్టేలా లేదు. కాలం గడిచేకొద్ది ఒక్కొక్కరుగా కరోనా కష్టాల గురించి చెబుతున్నారు. తాజాగా అందాల నటి రేణూదేశాయ్ తాను కూడా కరోనా బాధితురాలినే అని చెప్పారు. సోషల్ మీడియాలో రేణూ చాలా యాక్టీవ్ అనే విషయం తెలిసిందే.తాజాగా లేట్‌గానైనా, లేటెస్ట్ విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. తాను కూడా కరోనా బారిన పడ్డానన్నారు. ట్రీట్‌మెంట్ తీసుకుని తిరిగి కోలుకున్నట్టు ఆమె వెల్లడించారు. సమాజంలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గలేదన్నారు. కరోనా ప్రభావం ఎప్పట్లానే ఉందన్నారు. జాగ్రత్తగా ఉండడం ఒక్కటే పరిష్కారమన్నారు. కరోనా సోకడంతో తాను కొన్ని రోజులు ఇంటికే పరిమితమైనట్టు ఆమె చెప్పారు. దీంతో షూటింగ్‌ల్లో పాల్గొనలేదన్నారు. అలాగే తాను ప్రధానపాత్రలో నటించిన వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయిందని, వాటి వివరాలు త్వరలో చెబుతామని రేణూ వెల్లడించారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేణూ తెలిపారు.
