ప్రేమలో పడ్డ పవన్ కళ్యాణ్ మాజీ భార్య

రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు. బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించిన రేణు పవన్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయి వేరుగా ఉంటున్నారు. వీరికి కుమారుడు అకిరా నందన్, కూతురు ఆధ్యలు ఉన్నారు. అయితే పవన్, రేణు విడిపోయినప్పటికి తామీద్దరం స్నేహితులమేనని పలు ఇంటర్వ్య లో చెప్పుకొచ్చారు. అంతేగాక పవన్ పిల్లలతో సరదాగా సమాయాన్ని గడుపుతుంటారని చెప్పేవారు. పవన్ నుంచి విడిపోయిన తర్వాత పూణేలో ఉంటున్న రేణూ సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఆ మధ్య తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. దీంతో పవన్ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగారు.కొద్ది నెలల క్రితం తనకు ఎంగేజ్ మెంట్ కూడా అయిందని చెప్పకొచ్చిన రేణు మళ్లీ ఆ ముచ్చట తీయలేదు. అయితే ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రేణు దేశాయ్ తాను ప్రేమలో పడినట్టు చెప్పుకొచ్చింది. ఇంతకు రేణు ఎవరి ప్రేమలో పడింది అంటే ప్లూటో అనే ఓ కుక్క పిల్లతో. తాను ఆ కుక్క పిల్లతో అధికారికంగా ప్రేమలో ఉన్నానంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. జంతు ప్రేమికురాలైన రేణు దేశాయ్ ఇంట్లో పిల్లులతో పాటు కుక్కలు కూడా ఉన్నాయి.