బహుముఖ ప్ర‌జ్ఞాశాలి ఎన్టీఆర్ స్మృతిలో

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, స్టూడియో అధినేత‌గా, ముఖ్య‌మంత్రిగా ఇలా అన్నిరంగాల‌లోను త‌న‌దైన ముద్ర వేసుకున్న విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌కరామారావు. బహుముఖ ప్ర‌జ్ఞాశాలి అయిన ఎన్టీఆర్ పౌరాణికం, జాన‌ప‌దం, సాంఘికం, చారిత్రాత్మ‌క పాత్ర‌ల‌లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. ఇక  రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న చేసిన సేవ‌లు అశేషం. నేడు ఎన్టీఆర్ 25వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆ మ‌హానుభావుడిని ప్ర‌తి ఒక్క తెలుగోడు స్మ‌రించుకుంటున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్,క‌ళ్యాణ్ రామ్‌లు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా త‌మ తాత‌ని స్మరించుకున్నారు.  తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే అంటూ కామెంట్ చేశారు. ఇక నారా రోహిత్.. 25వ వర్ధంతి సందర్భంగా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ ఎన్టీఆర్ ఫొటో ఒక‌టి షేర్ చేశారు. యన్టీఆర్ తన 44 ఏళ్ళ సినీ జీవితంలో  13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు, 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెర పై చెరగని ముద్ర వేసారు.   హిందీలో ‘నయా ఆద్మీ’ ‘చండీరాణి’ అనే రెండు సినిమాలతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించారు