‘క్రాక్’ ట్రైల‌ర్ కిరాక్

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ ప్ర‌ధాన పాత్ర‌లో గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన చిత్రం క్రాక్. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కులకి పిచ్చెక్కిస్తున్నాయి. ర‌వితేజ్ ప‌వ‌ర్ ఫుల్ ప‌ర్‌ఫార్మెన్స్ సినిమాపై అంచ‌నాలు పెంచుతున్నాయి. శృతిహాస‌న్ గ్లామ‌ర్ కూడా సినిమాకు ప్ల‌స్ అవుతుంది.ర‌వితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం క్రాక్ కాగా, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా  రూపొందుతోంది. ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకొనే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. స‌ర‌స్వతి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఎస్. త‌మ‌న్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. క్రాక్’ మూవీకి విక్టరీ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్ ఇస్తుండ‌డం స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా చెప్ప‌వ‌చ్చు.