రవితేజ క్రాక్ AP-TG బిజినెస్….మాస్ మహారాజ్ భీభత్సం పక్కా!

మరింత క్రేజ్ ను పెంచుకున్న క్రాక్ సినిమా ఇప్పుడు భారీ లెవల్ లో ఈ నెల 9 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అనుకున్నప్పుడు బిజినెస్ 18 కోట్ల రేంజ్ లో జరగగా… ఇప్పుడున్న పరిస్థితుల నేపధ్యంలో బిజినెస్ తగ్గింది అయినా కానీ మొత్తం మీద నైజాంలో 4.2 కోట్ల బిజినెస్ ను, సీడెడ్ లో 2.8 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ ఆంధ్రా లో 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో…మొత్తం మీద సినిమా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల ఓన్ రిలీజ్ సొంతం అవ్వనుంది కాబట్టి ఆ బిజినెస్ ని ఇంక్లూడ్ చేయలేదు. మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 13.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో నిలుస్తుంది అని ఫిల్మ్ నగర్ టాక్👍