రణ్‌బీర్‌ కపూర్‌ ఆలియా వివాహం

మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌, చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ ఎట్టకేలకు తనమనసులోని మాటను బయట పెట్టేశాడు. పలు ప్రేమాయాణాలు నడిపిన ఈ బాలీవుడ్‌ హీరో ర‌ణ్‌బీర్ తన ప్రేమికురాలు అలియా భ‌ట్ అని తేల్చి చెప్పేశాడు. త్వ‌ర‌లోనే త‌మ పెళ్లి జరగనుందంటూ ఫ్యాన్స్‌కు తీపి కబురందించాడు.

అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా మ‌హమ్మారి కారణంగా తమ వివాహం వాయిదా పడిందని, లేదంటే ఈ పాటికే పెళ్లి జ‌రిగి ఉండేద‌ని ర‌ణ్‌బీర్ వ్యాఖ్యానించారు. దీనిపై ఇంత‌కంటే ఇప్పుడేమీ చెప్ప‌లేను, కానీ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుందా మ‌నుకుంటామన్నారు. ఒక ఇంటర్వ్యూలో రణబీర్‌ తమ పెళ్లి కబురును ధృవీకరించారు.

కాగా రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్ ,నాగార్జున, డింపుల్‌ కపాడియా ఇతర కీలక పాత్రలుపోషించారు.