హీరో కుటుంబానికి కరోనా

లాక్‌డౌన్‌ అనంతరం సెలబ్రిటీలు మెల్లగా సినిమా షూటింగ్‌లకు వెళ్లడం ప్రారంభిస్తుంటే రామ్‌ మాత్రం ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంగ్లీష్‌ మీడియాతో సంభాషించారు. ఇంటి నుంచే వర్చువల్‌గా స్టోరీ స్క్రీప్ట్స్‌ వింటూ, ఫోటో షూట్‌లతో బిజీగా ఉంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తనకు అన్ని (మంచి, చెడు)అనుభవాలను ఇచ్చిందన్నారు. కుటుంబంతో కలిసి ఎక్కవ సమయాన్ని గడిపేందుకు సమయం దొరకగా మరోవైపు ఇంట్లో ఎక్కువ సేపు ఉండటం కొంత నిరశకు గురిచేస్తుందన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఇంట్లోనే ఉన్నప్పటికీ స్ర్కిప్ట్‌ వింటూ, మీటింగ్స్‌ కోసం వర్చువల్‌ కాల్స్‌కు హాజరవుతున్నాను. ఇందుకు మంచి దుస్తులు ధరించాను. దీంతో వర్క్‌ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహించేందుకు ఏదైనా చేయాలనిపించింది. అందుకే ఫోటోషుట్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాను.

ఎక్కువ సమయం ఇంట్లో ఉండటం తేలికైన విషయం కాదు. నాకు కొంచెం విసుగొచ్చింది. అంతేగాక నా కుటంబం కరోనా బారిన పడింది. అమ్మ, సోదరుడు(కృష్ణ చైతన్య) కరోనా సోకింది. ఈ విషయం తెలిసి చాలా భయం వేసింది. ముఖ్యంగా నా సోదరుడికి తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. చివరికి దేవుని దయతో పూర్తిగా కోలుకున్నాడు.

లాక్‌డౌన్‌లో ఎక్కువడా ఒంటరి జీవితాన్ని గడిపాను. నాకు నా బార్డ్‌(పెంపుడు కుక్క) తోడుగా నిలిచింది. నేనే స్వయంగా వంట చేయడం, బుక్స్‌ చదవడం, బార్డ్‌ను వాకింగ్‌కు తీసుకెళ్లడం చేశాను. ఇదంతా చాలా బోరింగ్‌గా అనిపించింది. అయినా ఇలా ఎక్కువ రోజులు ఉండలేం. అదృష్టంకొద్ది తొమ్మిది నెలల తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి.

2020 ఏడాది కోసం ఆసక్తిగా ఉన్నాను. నా చిత్రం రెడ్‌ వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇది కొత్త ఏడాదిని ప్రారంభించేదుకు సరైన మార్గం. 2020 మనకు మనం ఆత్మపరిశీలన చేసుకోవడాని ఒక అవకాశాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నాను. వచ్చే ఏడాదిని సానుకూలంగా ప్రారంభించాలనుకుంటున్నాను. శక్తి, సానుకూల ధృక్పథంతో వచ్చే ఏడాదిని ప్రారంభిద్దాం’. అని పేర్కొన్నారు.