జీవితంలో మొదటి ఆదర్శం మీరే నాన్నా

‘‘మీ గురించి చెప్పాలంటే ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో అర్థం కావడంలేదు. ఎక్కడ ముగించాలో కూడా అర్థం కావడంలేదు. మీ మీద ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పలేను. ఆ ప్రేమ చెప్పడానికి పదాలు సరిపోవు’’ అని తన తండ్రి కుల్వీందర్‌ సింగ్‌ను ఉద్దేశించి అన్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇటీవల కుల్వీందర్‌ 60వ బర్త్‌డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా రకుల్‌ మాట్లాడుతూ – ‘‘జీవితంలో మొదటి ఆదర్శం మీరే నాన్నా. నా తొలి గురువు మీరు. నా బలం మీరు. నా సపోర్ట్‌ సిస్టమ్‌ మీరే. నా గైడ్‌ కూడా. అలాగే నా అతి పెద్ద క్రిటిక్‌ కూడా మీరే. మీ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాను. నా సూపర్‌ హీరో మీరే. మీరు గర్వపడేలా చేస్తాను.. ప్రామిస్‌. హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్‌డే’’ అన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే టాలీవుడ్‌ మీద ఫోకస్‌ తగ్గించి బాలీవుడ్‌లో బిజీగా మారిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం హీరో జాన్‌ అబ్రహాంతో కలిసి ‘అటాక్‌’ సినిమా చేస్తోంది. మరోవైపు అజయ్‌ దేవగన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మే డే’లో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అజయ్‌ దేవగన్‌ ‘థాంక్‌ గాడ్‌’ లోనూ కనిపించనుంది. కామెడీ డ్రామా డాక్టర్‌ జీలో ఆయుష్మాన్‌ ఖురానాతో జోడీ కడుతోంది.