‌ కరోనా బారిన పడ్డ రకుల్‌

టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మంగళవారం ఆమే స్వయంగా ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘నేను కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది.

దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోగలరు. అందరు జాగ్రత్తగా ఉండండి’అంటూ ట్విటర్‌ వేదికగా రకుల్‌ విజ్ఞప్తి చేసింది. కాగా, రకుల్‌ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది. ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.