రజనీకాంత్ అభిమాని ఆత్మహత్యాయత్నం

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అనారోగ్యం వ‌ల‌న తాను రాజ‌కీయాల‌లోకి రాలేనంటూ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేపోతున్నారు.  ఆయ‌న దిష్టిబొమ్మ‌లు త‌గ‌ల‌బెట్ట‌డం, ఇంటి ముందు నిర‌స‌న‌లు, ర్యాలీలు చేయ‌డం వంటివి చేస్తున్నారు. తాజాగా మురుకేసన్ అనే వ్య‌క్తి ర‌జ‌నీ త‌న నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని త‌న‌కు తాను  నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.మురుకేస‌న్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు ప్ర‌స్తుత వైద్యం అందిస్తున్నారు. ర‌జ‌నీకాంత్ త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి త‌మిళనాట భారీ ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. వీటికి త‌లైవా ఎలా చెక్ పెడ‌తాడ‌ని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నాత్తె షూటింగ్ కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ర‌జ‌నీ హై బీపీ వ‌ల‌న ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. మూడు రోజుల త‌ర్వాత డిశ్చార్జ్ చేయ‌గా, ప్ర‌త్యేక  ఫ్లైట్‌లో చెన్నైకు వెళ్ళారు.