18కోట్ల ఆఫర్ వదులుకున్న ‘ఉప్పెన’ నిర్మాతలు

మరో పది రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలకు గాను మాంచి ఆఫర్ వచ్చింది. అవుట్ రేట్ న, రెండు రాష్ట్రాల థియేటర్ హక్కులకు 18 కోట్లు ఇస్తామని బయ్యర్ వచ్చారు. మైత్రీ మూవీస్ జనాలు కాస్త ఊగిసలాడారు కూడా. ఇంత మంచి ఆఫర్ వదులకోవడమా? అని. కానీ నైజాం కు దిల్ రాజుకు ఎప్పడో మాట ఇచ్చారు. నాలుగు కోట్లకు. ఆయన గట్టిగా పట్టుకుని కూర్చున్నారు.ఆఖరికి ఈ బేరం చూపించి, నైజాం ను యాభై లక్షల రేటు పెంచి, నాలుగున్నర కోట్లకు దిల్ రాజుకే ఇచ్చేసినట్లు తెలుస్తోంది. మాంచి ఆఫర్ ఇచ్చిన బయ్యర్ కు తరవాత సినిమా చూద్దామని, ఈ సినిమా వరకు సుకుమార్ తో ఆబ్లిగేషన్ వుందని, అందువల్ల అటు ఇచ్చేసామని చెప్పి సముదాయించినట్లు తెలుస్తోంది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప సినిమా కూడా నైజాం హక్కులు ఇస్తామని దిల్ రాజుకే మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి నైజాంలో సినిమాల బేరం హుషారు అందుకుంది. కొత్త బయ్యర్ ఆఫర్లు ఇస్తుంటారు. ఆ ఆఫర్లు చూపించి నిర్మాతలు రేటు పెంచి దిల్ రాజుకు ఇస్తుంటారు. భలేగా వుందిగా ఈ వ్యవహారం.