సలార్‌లో ప్రియాంక చోప్రా

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, ‌‘కేజీఎఫ్’‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సలార్‌’. ప్రస్తుతం ఈ సినిమా గోదావరిఖని సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రభాస్‌‌ ఏంట్రీ సీన్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమచారం. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సలార్‌లో మాస్‌ మసాలతో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఈ పాట కోసం గ్లోబల్‌ స్టార్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రాను దర్శకుడు సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రియాంక ఇంతవరకు స్పందించలేదని, దర్శకుడు ఆమె గ్రీల్‌ సిగ్నల్‌ కోసం వేయిట్‌ చేస్తున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.

కాగా ప్రియాంక ఇదివరకు బాలీవుడ్‌లో ‘అగ్నిపత్‌’, ‘రావన్‌’ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికన్‌ సింగర్‌ నిక్‌జోనస్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం ప్రియాంక ఎక్కువుగా హాలీవుడ్‌ చిత్రాలపైనే దృష్టి పెట్టారు. కాగా సలార్‌ స్పెషల్‌ సాంగ్‌ కోసం ప్రియాంకకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌ ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ప్రియాంక దీనిపై సమాధానం ఇవ్వాలని.. త్వరలోనే దీనిపై క్లారిటి ఇవ్వనున్నట్లు సమచారం. కాగా ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో విలన్‌గా మొదట తమిళ నటుడు విజయ్‌ సేతుపతి పేరు వినిపించగా.. తాజాగా మరో నటుడు మధు గురుస్వామి నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి.