రెండో పెళ్లికి రెడీ అయిన సీనియర్‌ నటి

సీనియర్‌ నటి ప్రేమ రెండో పెళ్లికి రెడీ అయిందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. త్వరలోనే ఆమె మూడు ముళ్లు వేయించుకోనుందంటూ సోషల్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన మీద వస్తున్న వార్తలను కొట్టిపారేసింది నటి ప్రేమ. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని తేల్చి చెప్పింది. అలాగే తన ఆరోగ్యం మీద వస్తున్న వదంతులను నమ్మవద్దని, తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొంది.

నటి ప్రేమ 2006లో వ్యాపారవేత్త జీవన్‌ అప్పచును పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ మధ్య ఈమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు వార్తలు రాగా, అందులో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రేమ కన్నడ, తమిళం, మలయాళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించింది. శివరాజ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘సవ్యసాచి’తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె మోహన్‌లాల్‌, విష్ణువర్ధన్‌, వెంకటేశ్‌, జగపతి బాబు, రవిచంద్రన్‌, మోహన్‌ బాబు, సాయికుమార్‌ వంటి పలువురు స్టార్లతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ నటి 2017లో ఉపేంద్ర ‘మత్తే బా’ చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.