బొగ్గు గనుల్లో బైక్ రైడ్ చేస్తున్న ప్రభాస్

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయాడు. ‘రాధేశ్యామ్‌’, ‘సలార్’‌ వంటి భారీ యాక్షన్‌ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో ఓ ఫాంటసీ చిత్రంతో పాటు ‘ఆదిపురుష్’‌ వంటి మూవీస్‌లో నటించేందుకు రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ‘సలార్’‌ మూవీ ఫస్ట్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ గోదావరిఖని సింగరేణి కోల్‌మైన్స్‌లో జరుపుకున్న సంగతి తెలిసిందే.

బొగ్గు గనుల సమీపంలో దాదాపు పది రోజుల పాటు ఈ మూవీ షూటింగ్‌ జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి షూటింగ్‌ సెట్స్‌లోని ప్రభాస్‌ ఫొటోలు ఒక్కొక్కటిగా లీక్‌​ అవుతూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఫొటో కూడా బయటకొచ్చింది. ఇందులో ప్రభాస్‌ బోగ్గు గనుల్లో బుల్లెట్‌ బైక్‌ నడుపుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసి డార్లింగ్‌ ఫ్యాన్ష్‌ ఫిదా అవుతున్నారు.

కాగా బోగ్గు గనుల్లో డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఈ మూవీ ఫస్ట్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ నేపథ్యంలో ప్రభాస్‌‌ ఏంట్రీ సీన్‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే మొదలు కానున్న సెకండ్‌ షెడ్యూల్‌లో హీరోయిన్‌ శృతి హాసన్‌తో పాటు తదితర నటీనటులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇందులో శృతీ హాసన్‌ తోలిసారిగా ప్రభాస్‌ సరసన నటిస్తున్నారు. దీనితో పాటు దర్శకుడు కే రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘రాధేశ్యామ్’‌ షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది. వీటి తర్వాత ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో నటించేందుకు రేడి అవుతున్నాడట. ఇందుకు కోసం ‘సలార్’‌, ‘రాధేశ్యామ్’‌ షూటింగ్‌లను చకచకా పూర్తి చేయాలనే ఆలోచనలో డార్లింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.