చిట్టిబాబు సరసన జిగేల్ రాణి

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ పూజా హెగ్డేకు మరో మంచి చాన్స్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  సరసన నటించే చాన్స్ వెదుక్కుంటూ వచ్చింది. పైగా కొరటాల శివ లాంటి టాప్ డైరక్టర్, మెగాస్టార్ హీరోగా చేస్తున్న సినిమా. అందుకే వెంటనే ఓకె అనేసినట్లు బోగట్టా. నిరంజన్ రెడ్డి నిర్మించే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ నలభై నిమషాల ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్యారెక్టర్ కు హీరోయిన్ వుంటుంది. డ్యూయట్ కూడా వుంటుంది. చాలా పేర్లు పరిశీలించిన మీదట పూజానే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.ఇప్పటి వరకు రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే చేయలేదు. ఇదే తొలిసారి. ఇప్పటికే ఆచార్య సినిమా మీద మాంచి అంచనాలు వున్నాయి. అటు మెగాస్టార్ సినిమా కావడం, భరత్ అనే నేను తరువాత కొరటాల చేస్తున్న సినిమా కావడం, చిరు-చరణ్ కలిసి చేస్తున్న సినిమా కావడం ఇలా అన్ని రకాల అట్రాక్షన్ లు వున్నాయి. వీటికి ఇప్పుడు పూజా పేరు తోడయింది.