ఏం నాయనా లడ్డూ కావాలా..ఇంకో లడ్డూ కావాలా?

నాయనా లడ్డూ కావాలా..ఇంకో లడ్డూ కావాలా? అన్నట్లుగా వుంది ఇది. చైతూ-విక్రమ్ కే కుమార్ సినిమాకు హీరోయిన్ వెదుకులాట గట్టిగా సాగుతోంది.ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాకుండా మరో హీరోయిన్ కూడా వుండాలి కథ ప్రకారం. అందుకే ఆ ఇద్దరి కోసం వెదుకుతున్నారు. హీరోయిన్ల విషయంలో నిర్మాత దిల్ రాజు ఆప్షన్ పూజా హెగ్డే, రష్మిక అని తెలుస్తోంది. ఆ ఇద్దరి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరిలో కనీసం ఒకరు ఓకె అన్నా, మరో హీరోయిన్ గా వేరే వాళ్లని తీసుకోవచ్చు అన్నది ప్లాన్. లేదూ ఇద్దరూ ఓకె అంటే రెండు లడ్డూలు దొరికేసినట్లే. కానీ ఈ ఇద్దరూ లీడింగ్ హీరోయిన్లే. ఇద్దరూ కలిసి ఓ సినిమాలో చేయడం అన్నది కాస్త అసాధ్యమైన వ్యవహారమే. కానీ ఈ దిశగానే నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు బోగట్టా. ఈ ఇద్దరూ దొరక్కపోతే మరో పాపులర్ హీరోయిన్ ను ఎవరిన్నన్నా తీసుకోవాలన్నది ఆఖరి ఆప్షన్.