విజయ్‌సేతుపతికి క్యూ కడుతున్న ఆఫర్లు

తమిళనాట విజయ్‌సేతుపతికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ పెంచుకుంటున్నారు నటుడు విజయ్‌సేతుపతి. అందుకే విలక్షణమైన పాత్రలు పోషించాలంటే అది విజయ్‌ సేతుపతే అనేంతగా పాత్రకు వంద శాతం న్యాయం చేస్తారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే విలన్‌ సహా కీలక పాత్రలు పోషిస్తూ తన మార్క్‌ చూపిస్తున్నారు. ఇటీవలె సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్‌ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. దీంతో తెలుగులో ఆయనకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఆయనను సంప్రదించినట్లు సమాచారం. విజయ్‌ సేతుపతి హీరోగా తెలుగులో డైరెక్ట్‌గా ఓ సినిమా చేయాలని ఆయనను కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే ఆయనకు కథ కూడా వినిపించినట్లు ఇండస్ర్టీలో టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీ అప్‌డేట్స్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.