మార్చి 26…రంగ్ దే

నితిన్-కీర్తి సురేష్ కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ నిర్మించిన సినిమా రంగ్ దే. వెంకీ అట్లూరి డైరక్షన్ లో ఈ సినిమా దాదాపు రెడీ అయిపోయింది. వాస్తవానికి పండుగ బరిలో దిగడమా? ఓటిటికి ఇవ్వడమా? ఇలా అనేక ఆలోచనలు చేసారు. ఆఖరికి నేరుగా థియేటర్లలోకే రావాలని డిసైడ్ అయ్యారు.అయితే ప్రస్తుతం ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీకే అనుమతి వుంది. మార్చి నుంచి హండ్రెడ్ పర్సంట్ ఆక్యుపెన్సీ వస్తుందని అనుకుంటున్నారు. అందుకే అందరూ మార్చి తరువాత సినిమాల విడదులలు ప్లాన్ చేస్తున్నారు. పవన్ వకీల్ సాబ్ ను ఏప్రిల్ 9న విడుదల చేయాలనుకుంటున్నారు. దానికి రెండు వారాలు ముందుగా, గ్యాప్ ఇచ్చి రంగ్ దే విడుదల చేయబోతున్నారు.పైగా మార్చి 26 విడుదలయితే లాంగ్ వీకెండ్ వస్తుంది. హోలీ తదితర సెలవులు వున్నాయి. అందుకే ఈ డేట్ మీద రంగ్ దే రుమాలు వేసినట్లు కనిపిస్తోంది.