థమన్‌ ని ట్రోల్‌ చేస్తున్న నెటిజనులు

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్నారు సంగీత దర్శకుడు థమన్‌. అల వైకుంఠపురం హిట్‌తో దూసుకుపోతున్న తమన్‌ స్పీడ్‌కి క్రాక్‌ సినిమా బ్రేకులు వేసేలా కనిపిస్తుంది. రవితేజ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో క్రాక్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి బల్లేగా దొరికావే బంగారం పాట రిలీజ్‌ అయ్యింది. సూపర్‌.. ఫెంటాస్టిక్‌ అంటూ రవితేజ ఫ్యాన్స్‌, తమన్‌ ఫ్యాన్స్‌ ఫుల్లు ఖుషి అవుతున్నారు. కానీ వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. తమన్‌ ఈ ట్యూన్‌ని లాటిన్‌ చిత్రం నుంచి కాపీ చేశారంటూ నెటిజనులు ట్రోల్‌ చేస్తున్నారు. ఒరిజనల్‌ ‘సెల్వా ఎల్ నియాన్’ ట్యూన్‌ని కూడా షేర్‌ చేస్తున్నారు.

ఇక బల్లే దొరికిపోయావ్‌ తమన్‌ అంటూ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు నెటిజనులు. ఒక యూజర్‌ అయితే ‘‘థ్యాంక్స్‌ అన్న రెండు నెలలుగా కేవలం 47 మాత్రమే ఉన్న వ్యూస్‌ నీ వల్ల రాత్రికి రాత్రే 17కే అయ్యాయ్‌’’ అని కామెంట్‌ చేయగా.. మరి కొందరు ‘‘సాంగ్‌ లాటిన్‌.. కామెంట్స్‌ తెలుగు.. క్రెడిట్స్‌ తమన్‌.. ఎవరు గుర్తు పట్టరు అనుకున్నారు… కానీ దొరికిపోయారు.. ఈ వీడియో తప్పకుండా వైరల్‌ అవుతుంది’’ అంటూ నెటిజనులు తెగ ట్రోల్‌ చేస్తున్నారు. ఇక మరి కొందరు థమన్‌ పరిస్థితిని కింగ్‌ సినిమాలో నాగార్జున-బ్రహ్మానందం మధ్య వచ్చే కామేడీ సీన్‌తో పొలుస్తున్నారు. ఇక గతంలో ‘వి’ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ విషయంలో కూడా థమన్‌ కాపీ కొట్టాడనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.