మెగామూవీలోమరోసారి కనిపించబోతున్ననయనతార

నయనతార మరోసారి మెగామూవీలో కనిపించబోతోంది. అది కూడా కీలకమైన పాత్రలో. సైరా సినిమాలో మెగాస్టార్ సరసన నటించి, రాజసం ఒలకబోసిన నయనతార, ఈసారి ఎవ్వరూ ఊహించని పాత్రలో కనిపించబోతోంది. లూసిఫర్ సినిమాలో సిఎమ్ కుమార్తె పాత్రలో నయనతారను తీసుకోవాలనే ఆలోచనలు బలంగా సాగుతున్నాయి.ఈ మేరకు దాదాపు నిర్ణయం ఖరారు అయింది. నయన్ తో మాట్లాడి ఫైనల్ చేసుకోవాల్సి మాత్రమే వుంది. ఇప్పటికే సత్యదేవ్ ను తీసుకున్నారు. అయితే సత్యదేవ్ పాత్ర ఏమిటన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ఏ పాత్ర అయినా తాను చేస్తానని, ఆఖరికి విలన్ గా అయినా సరే తాను మెగాస్టార్ సినిమాలో చేయడానికి రెడీ అని సత్యదేవ్ చెప్పినట్లు బోగట్టా.ఈ ఇద్దరు ప్లస్ మెగాస్టార్ చిరంజీవి కాకుండా మరో రెండు కీలకపాత్రలకు సమాలోచనలు సాగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ క్యారెక్టర్లకు కూడా యాక్టర్లను ఫైనల్ చేస్తారు.