నవీన్ చంద్ర నయా మూవీ షురూ

సర్వంత్ రామ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 9 చిత్రం ప్రారంభమైంది.  నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటి మధుబాల ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో  నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా.. మూవీ స్క్రిప్ట్‌ను సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చిత్ర యూనిట్‌కు అందచేశారు. రాశి మూవీస్ అధినేత నరసింహారావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. చిత్ర దర్శకుడు అరవింద్ మొదటి షాట్‌కు యాక్షన్ చెప్పారు.ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘అరవింద్‌గారు చెప్పిన ఈ థ్రిల్లర్ నాకు బాగా నచ్చింది. మధుబాలగారితో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మంచి థ్రిల్లర్‌లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది.. అన్నారు.మధుబాల మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ అరవింద్ నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఈ సినిమాలో డీజీపీగా పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాను. చాలా కాలం తరువాత మంచి కథతో తెలుగులో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది..’’ అన్నారు.డైరెక్టర్ అరవింద్ మాట్లాడుతూ.. ‘‘సర్వoత్ రామ్ క్రియేషన్స్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మధుబాల, నవీన్ చంద్ర మా స్క్రిప్ట్ నచ్చి ఈ మూవీ ఒప్పుకున్నారు. నిర్మాత నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరినీ అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది..’’ అన్నారు.నిర్మాత రామాంజనేయులు జవ్వాజి మాట్లాడుతూ.. ‘‘ఈ కథ విని వెంటనే నవీన్ చంద్ర ఒప్పుకున్నారు. ఆయన నిర్మాతల హీరో అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ అరవింద్‌ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ కథను రాసుకున్నారు. మధుబాల ఈ సినిమాలో నటించడం మరో పెద్ద ఎస్సెట్. ఫిబ్రవరి నుండి చెన్నైలో షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్‌లో ఎండ్ చేస్తాము. ఒకే షెడ్యూల్‌లో సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తి చెయ్యడానికి ప్లాన్ చేశాము. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం మరో హైలెట్ కానుంది’’ అని అన్నారు.