జోరు మీదున్న నాని

హీరో నాని ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగుకు బ్రేక్‌ పడింది. ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు. తాజాగా నాని తన తదుపరి చిత్రాన్ని వేణు శ్రీరామ్‌తో చేసేందుకు మొగ్గు చూపుతున్నాడట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్‌ వకీల్ సాబ్‌ చిత్రాన్ని తెరెకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే అల్లుఅర్జున్‌తో ఐకాన్‌ చిత్రాన్ని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల బన్నీ ఈ ప్రాజెక్టు చేసేందుకు సుముఖంగా లేరట. దీంతో ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కేలా కనిపించడం లేదు. దీంతో తన తదుపరి చిత్రాన్ని నానితో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే నానికి కథ చెప్పారని ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నాని కూడా శ్రీరామ్ వేణుతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.