విడుదలకు సిద్ధంగా ఉన్న నాని సినిమా

అన్ని రంగాలతో పోలిస్తే కరోనా సెకండ్‌ వేవ్‌ సినిమా రంగంపై అధికంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తెలంగాణలో థియేటర్లన్నీ మూతపడ్డాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో సినిమా షూటింగులు కూడా నిలిచిపోతున్నాయి. మెగాస్టార్‌ ‘ఆచార్య’ నుంచి ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ వరకు అన్నీ సినిమా వాయిదా పడ్డాయి. అయితే మొన్నటి వరకు అల్లు అర్జున్‌ పుష్ప సినిమా చిత్రీకరణలో పాల్గొన్నాడు. కానీ ఇటీవల తనకు కరోనా సోకడంతో ఆ షూటింగ్‌కు కూడా బ్రేక్‌ పడింది. తాజాగా కరోనాకు భయపడకుండా మరో టాలీవుడ్‌ హీరో షూటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.

అతనే న్యాచురల్‌ స్టార్‌ నాని. ప్రస్తుతం నాని ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ చోట ప్రత్యేకంగా సెట్‌ వేయించి షూటింగ్‌ జరుపుతున్నారు. అయితే కరోనా ప్రమాదం పొంచి ఉన్న సమయంలో షూటింగ్‌ ఏంటి అని ప్రశ్న అందరి మనుసులో తలెత్తుతోంది. కానీ చిత్రీక‌ర‌ణ నిలిపేస్తే భారీ మొత్తంలో న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో మేక‌ర్స్ షూట్ కొన‌సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు నాని నటించిన టక్ జగదీష్‌ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎప్పుడు రిలీజ్‌ అవు తుందో క్లారిటీ లేదు.