క్రిస్మస్ ముందు రోజు సాయంత్రం మెగా ఫ్యామిలీ అంతా రామ్ చరణ్ ఇంట్లో క్రిస్మస్ వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ప్రతి ఒక్కరు చాలా సన్నిహితంగా మెలిగారు. సెలబ్రేషన్స్ అయిన నాలుగు రోజులకు రామ్ చరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా పాజిటివ్ అని రావడంతో ఆ రోజు వేడుకలో పాల్గొన్న వారందరు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఉపాసన తనకు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ, వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అని ట్వీట్ చేసింది.ఇక అల్లు శిరీష్ కూడా తనకు నెగెటివ్ వచ్చినట్టు చెప్పారు. అయితే హనీమూన్‌లో భాగంగా మాల్దీవులకు వెళ్లిన చైతన్య,నిహారిక కూడా క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది అని అంతా ఆందోళన చెందుతున్న సమయంలో నాగబాబు స్పందించారు. మాల్దీవులకు వెళ్లే ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిసెంబర్ 26న ఇద్దరు టెస్ట్ చేయించుకున్నారు. అందులో నెగెటివ్ అని తేలింది. డిసెంబర్ 29న ముంబై ఎయిర్ పోర్ట్‌లోను కరోనా పరీక్షలుచేయించుకున్నారు. ఆ రిపోర్ట్స్‌లోను నెగెటివ్ వచ్చిందని పేర్కొన్నారు.