లక్ష్య టీజర్…

హీరో నాగశౌర్య ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసాడు. ఫన్, లవ్, మాస్ ఇలా అన్నీ టచ్ చేసాడు. హిట్ లు వున్నాయి. ఫట్ లు వున్నాయి. కానీ ఏ సినిమా టీజర్ అయినా శౌర్యలోని అన్ని యాంగిల్స్ ను బయటకు తీసింది లేదు. తొలిసారి అలాంటి టీజర్ వచ్చిందనిపించింది. సునీల్ నారంగ్, శరత్ మరార్ కలిసి నిర్మించే లక్ష్య సినిమా టీజర్ ను హీరో బర్త్ డే సందర్భంగా విడుదల చేసారు. నిజానికి లైన్ కొత్తగా లేదు.క్రీడల్లో సూపర్ టాలెంట్ వుండడం, ఎక్కడో తేడా కొట్టి అన్నీ వదిలేసి తాగుతూ వుండడం, తిరిగి మళ్లీ ఫామ్ లోకి రావడం లాంటి లైన్ నే అనిపిస్తోంది టీజర్ చూస్తుంటే. అయితే శౌర్యలోని వేరియేషన్లు, ఎమోషన్ ను బాగా ప్రెజెంట్ చేసినట్లు కనిపిస్తోంది.అలాగే ఇప్పటి వరకు తెరపైకి రాని ఆర్చరీ క్రీడ నేపథ్యం కావడం ఆసక్తిగా వుంది.  కాలభైరవ సంగీతం అందించారు. జగపతిబాబుది కీలకపాత్ర అని తెలుస్తూనే వుంది. టీజర్ ఫైనల్ షాట్ ఆయన మీద వేయడం ద్వారా కాస్త డిఫరెంట్ గా వుండేలా చూసుకున్నారు.