మోనాల్  ఐటమ్  సాంగ్ @ 12 లక్షలు

బిగ్ బాస్ నుంచి రాగానే హీరోయిన్ మోనాల్ ను చటుక్కున పట్టుకుని తమ సినిమా ఐటమ్ సాంగ్ కు ఫిక్స్ చేసేసాడు డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్.హీరో బెల్లంకొండ సాయి తో సంతోష్ శ్రీనివాస్ చేస్తున్న అల్లుడు అదుర్స్ సినిమా కోసం మోనాల్ చేత అయిటమ్ సాంగ్ చేయించేసారు. ఇందుకు గాను మోనాల్ కు 12 లక్షలు రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్న టైమ్ లో టాప్ లైన్ హీరోయన్ల డేట్ లు ఐటమ్ సాంగ్ కోసం తేవడం అంత వీజీ కాదు. పైగా కనీసం యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఇవ్వాలి. ఇలాంటి టైమ్ లో బిగ్ బాస్ క్రేజ్ తో వున్న మోనాల్ మాంచి చాన్స్ గా కనిపించింది. బిగ్ బాస్ నుంచి రాగానే తొలిసినిమా ఇదే. ఆ క్రేజ్ సినిమాకు యాడ్ అవుతుంది. పైగా పన్నెండు లక్షలతో పనయిపోయింది.మోనాల్ డ్యాన్స్ కూడా బాగా చేసిందని, ఐటమ్ సాంగ్ బాగా వచ్చిందని యూనిట్ వర్గాల బోగట్టా.అన్నట్లు మోనాల్ మా టీవీలో డ్యాన్స్ షో జడ్జిగా కూడా వర్క్ స్టార్ట్ చేసింది. ఓంకార్ డ్యాన్స్ ప్లస్ షో లో మోనాల్ ఓ జడ్జిగా వుంటోంది దీనికి కూడా మాంచి రెమ్యూనిరేషన్ అందుకుంటోంది.