నాకు ఆ పిలుపు నచ్చదు

తమ అభిమాన హీరో, హీరోయిన్లకు ఫ్యాన్స్‌ ముద్దు పేరు పెడుతుంటారు.కొత్త కొత్త పేర్లని వారికి కేటాయించి.. అదే పేరును హైలెట్‌గా చేస్తారు. ఇక టాలీవుడ్ బ్యూటీ తమన్నా అభిమానులు తమన్నాను ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు. అయితే ఆ పిలుపు ఈ అమ్మడికి నచ్చదట. ‘మిల్కీ బ్యూటీ’ ముద్దు పేరుపై తాజాగా తమన్నా మాట్లాడుతూ.. ‘అభిమానులు మంచి ఉద్దేశంతోనే మిల్కీ బ్యూటీ అని పిలుస్తున్నా..నాకు ఆ పిలుపు నచ్చదు.

శరీర వర్ణాన్ని బట్టి పేర్లు పెట్టడం తప్పు. మనదేశంలో తెలుపు రంగు చర్మం పట్ల అభిమానం,వ్యామోహం చాలా మందిలో కనిపిస్తోంది. కొన్నిసార్లు ఇలాంటి పేర్లు, ముద్రలు ఆత్మన్యూనతకు కారణమవుతాయి. మన టాలెంట్‌ను బట్టి ముద్దు పేర్లు పెడితే బాగుంటుంది. కానీ చర్మ రంగును బట్టి ముద్దుపేర్లు వద్దని’ తమన్నా చెప్పుకొచ్చింది.

ఇక ఇటీవల కరోనా బారిన పడిన తమన్నా.. కరోనాకు చికిత్స పొంది సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగులతో బిజీ అయిపోయింది. తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలంలో నటిస్తోంది. ఈ సినిమా ఓ కన్నడ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. గోపీచంద్ సరసన సీటీమార్ సినిమాలో నటిస్తుంది. అలాగే ‘లెవెంత్‌ అవర్‌’అనే వెబ్ సిరీస్ లోకూడా నటిస్తుంది.