మెగాస్టార్  ఆచార్య ముహుర్తం ఖరారు

మెగాస్టార్ మెగా మూవీ ఆచార్య. ఈ సినిమా నిర్మాణానికి చాలా టైమ్ పట్టింది. దానికి అనేకానేక కారణాలు. ఆఖరికి ఇప్పటికి ఓ క్లారిటీ వచ్చింది. రామ్ చరణ్ సెట్ మీదకు రావడం, షూటింగ్ చకచకా జరుగుతుండడంతో మే లో విడుదల అన్న క్లారిటీ ఇప్పటికే వుంది. ఇప్పుడు టీజర్ మీద కూడా యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. 29న సాయంత్రం 4.05 నిమిషాలకు (సినిమా జనాలకు ఈ తొమ్మిది సెంటిమెంట్ పొమ్మన్నా పోదు) విడుదల చేస్తామని చిన్న విడియో కట్ తో ప్రకటించేసారు. ఆచార్య స్పెల్లింగ్ కలిసి వచ్చేలా ఈ అనౌన్స్ మెంట్ ను కష్టపడి తయారుచేసారు. మణిశర్మ సంగీతం అందించే ఈ సినిమాకు దర్శకుడు కొరటాల శివ. దేవాలయ భూములు అన్యాక్రాంతం కావడం అనే పాయింట్ మీద కథ  అల్లుకున్నట్లు ఇప్పటికే గ్యాసిప్ లు వున్నాయి.  వచ్చే నెల నుంచి ఆచార్య షూటింగ్ ఈస్ట్ గోదావరి మారేడిమిల్లి అడవుల్లో జరుగుతుంది.