బంగారు గనుల నేపథ్యంలో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రం కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచింది. బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల వసూళ్ళు రాబట్టడంతో పాటు ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్‌ని కలిగించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తి కాగా, జవనరి 8న టీజర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
యష్ బర్త్‌డే సందర్బంగా జనవరి 8 ఉదయం 10.18ని.లకు విడుదల కానున్న ఈ చిత్ర టీజర్‌లో మాస్ ఎలివేషన్స్‌ని ఎక్కువగా చూపించనున్నట్టు తాజా సమాచారం. యష్ మరియు సంజయ్‌దత్‌కు సంబంధించిన సన్నివేశాలని టీజర్‌లో హైలైట్ చేయనున్నట్టు టాక్. గతంలో ఏ కన్నడ చిత్రంకు సంబంధించి ఇంతగా హైప్ రాలేదు. తొలిసారి కేజీఎఫ్2 చిత్రానికి సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చిన ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.