మరో సరికొత్త రికార్డును సాధించిన మహేశ్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, రష్మిక మందన జంటగా వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజై మహేశ్‌ బాబు గత సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. తాజాగా ఈ సినిమా మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది

అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌లు సాధించి ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచిన తెలుగు సినిమాల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది. అలాగే ఈ ఏడాదికి ఓవరాల్‌గా భారత్‌లో మూడో స్థానం సాధించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ `దిల్ బెచారా`, సూర్య `సూరారై పొట్రు` తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

కాగా, 2019లో కూడా మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా కూడా ఎక్కువ మంది ట్వీట్స్ చేసిన సినిమాగా నిలిచింది. అంతకు ముందు 2018లో ‘భరత్ అనే నేను’ సినిమా కూడా ఎక్కువ మంది ఈ సినిమాను ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.