టక్ జగదీష్..లవ్ స్టోరీ.. కథ సుఖాంతం

విడుదల తేదీల మీద కాస్త కిందా మీదా అయిన లవ్ స్టోరీ, టక్ జగదీష్ ల కథ సుఖాంతమైంది. ఇరు వర్గాలు కూర్చుని, హీరో నాని సలహా సూచనలతో వ్యవహారం స్మూత్ గా సెటిల్ చేసకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 16న లవ్ స్టోరీ, 23న టక్ జగదీష్ విడుదలవుతుంది.విషయం ఏమిటంటే ఆసియన్ సునీల్ నిర్మించిన చైతూ-సాయిపల్లవిల లవ్ స్టోరీ కి ఏప్రిల్ 2న డేట్ వేద్దాం అనుకన్నారు. కానీ తరువాత అనేక కారణాల వల్ల 16 కు మార్చారు. ఈ మార్చేటపుడు టక్ జగదీష్ ను అవుట్ రేట్ కు కొనుగోలు చేసిన లక్ష్మణ్ తో మాట్లాడే చేసారు. కానీ అప్పటికే నాని-శివనిర్వాణ ల టక్ జగదీష్ కు ఏప్రిల్ 16 డేట్ ఫిక్స్ అయి వుంది.సునీల్-లక్ష్మణ్ మాట్లాడుకున్న విషయం తెలియక తమ సినిమా డేట్ మీద వాళ్ల సినిమా డేట్ వేసారనుకున్నారు టక్ జగదీష్ యూనిట్. ఇలాంటి నేపథ్యంలో ఇరు వర్గాలు నిన్న సమావేశమయ్యాయి. పెద్ద సినిమాలు అన్నీ లైన్ లో వున్న టైమ్ లో అనవసరపు క్లాష్ లు వద్దని హీరో నాని స్వయంగా సూచించారు. దాంతో 16న లవ్ స్టోరీ, 23న టక్ జగదీష్ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ విధంగా వ్యవహారం సుఖాంతం అయింది.