‌ కరోనా బారిన పడ్డ స్టార్‌ హీరోయిన్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ఇన్‌ష్ట్రాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ముంబాయిలోని తన నివాసంలో క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమె లుక్కా చుప్పి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చండీగఢ్‌లో కొనసాగుతోంది. వారం రోజుల క్రితం తన షెడ్యూల్‌ ముగించుకొని ముంబాయి వచ్చారు. ఈ క్రమంలో ఆమె కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది.

కాగా, ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ లో కృతిసనన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె సీత పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో ప్రారంభం కానుంది. గతంలో మహేశ్‌ బాబు హీరోగా నటించిన 1 నేనొక్కడినే చిత్రంతో ఆమె టాలీవుడ్‌లో పరిచయమైంది. ఆ తర్వాత చైతన్యతో దోచెయ్‌ సినిమాలో నటించింది. ఆ తర్వాత హిందీ చిత్రాలకు పరిమితమయింది.