సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా క్రాక్. రవితేజకు దాదాపు నాలుగేళ్ళ తర్వాత వచ్చిన విజయం ఇది. 4 ఫ్లాపుల తర్వాత వచ్చిన హిట్ కావడంతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు మాస్ రాజా. మరోవైపు గోపీచంద్ మలినేని కూడా క్రాక్ విజయాన్ని పూర్తిస్థాయిలో పండగ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఒకట్రెండు ఫ్లాపులు వచ్చిన తర్వాత ఈ దర్శకుడిని కూడా చాలా మంది హీరోలు పట్టించుకోలేదు. నిర్మాతలు కూడా మొహం చాటేసారు. కానీ ఇప్పుడు క్రాక్ హిట్ అయ్యే సరికి వాళ్లే ఫోన్స్ చేసి మరీ మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో హిట్ కు ఉన్న వ్యాల్యూ ఇదే. ఇప్పుడు గోపీచంద్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇదిలా ఉంటే క్రాక్ సినిమాకు సీక్వెల్ చేయాలని ఉందని ముందు నుంచి చెప్తున్నాడు గోపీచంద్ మలినేని. అనుకున్నట్లుగానే ఇప్పుడు క్రాక్ 2 ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు కూడా. రవితేజ కూడా క్రాక్ 2 కోసం ఆసక్తిగా చూస్తున్నాడు. ఇదివరకే కిక్ 2 చేసి చేతులు కాల్చుకున్నాడు ఈ హీరో. అయినా కూడా క్రాక్ కథపై నమ్మకం ఉందంటున్నాడు మాస్ రాజా. ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేని మాత్రం క్రాక్ 2పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ సినిమా చేస్తాను కానీ ఈ సారి మాత్రం ఆయన ఉండడు అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఆయన అంటే రవితేజ కాదు..నిర్మాత అన్నమాట. క్రాక్ సినిమాను సరస్వతి సినీ చిత్ర బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మించాడు. అయితే క్రాక్ 2 సినిమాకు మాత్రం ఆయన నిర్మాత కాదని తెలుస్తుంది. ఈ సారి మరింత పెద్ద నిర్మాణ సంస్థను తీసుకొస్తున్నాడు గోపీచంద్ మలినేని. క్రాక్ సీక్వెల్ కుదిర్తే..ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గోపీచంద్ కూడా తనకు మైత్రితో సినిమా చేయాలని ఉందని.. చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం తెలుగులో పుష్పతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట సహా పవన్ సినిమాను కూడా నిర్మిస్తుంది మైత్రి మూవీ మేకర్స్. అలాంటి నిర్మాణ సంస్థతోనే క్రాక్ 2 చేయాలని ఉందంటున్నాడు గోపీ. మొత్తానికి క్రాక్ సీక్వెల్ కు ముందే సంచలన వార్త బయట పెట్టాడు ఈ దర్శకుడు.
