తెరవెనక ప్రేమాయణం

సినిమా అప్ డేట్స్ తో పాటు ఎఫైర్స్ కు సంబంధించిన అప్ డేట్స్ కూడా బాలీవుడ్ లో రెగ్యులర్ గా వస్తుంటాయి. సీజన్ కో ప్రేమకథ అక్కడ హల్ చల్ చేస్తుంటుంది. ప్రస్తుతం రణబీర్-అలియా ఎఫైర్ హాట్ గా నడుస్తోంది. త్వరలోనే అక్కడ మరో ప్రేమజంట తయారు కాబోతోంది. వాళ్లే కియరా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా.వీళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే అనుమానాన్ని ఇప్పటికే వ్యక్తంచేసింది బాలీవుడ్ మీడియా. అయితే వీళ్లిద్దరు మాత్రం ఎప్పుడూ బయటపడలేదు. పైపెచ్చు తమ రిలేషన్ షిప్ కు సంబంధించిన ప్రశ్నల్ని కూడా దాటవేస్తూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం మీడియాకు కచ్చితమైన ప్రూవ్ ఒకటి దొరికింది.కియరా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్ర కలిసి నూతన సంవత్సర వేడుకలు ప్లాన్ చేశారు. ఇద్దరూ కలిసి ఈరోజు మాల్దీవులకు బయల్దేరారు. వీళ్లతో పాటు అనన్య పాండే, ఇషాన్ కట్టర్ కూడా వెళ్తున్నప్పటికీ.. ఈ హాట్ జంటపై మాత్రమే మీడియా ఫోకస్ పడింది. ఎందుకంటే.. ఎఫైర్ అంటూ పుకార్లు వచ్చిన తర్వాత వీళ్లిద్దరూ కలిసి ఇలా మీడియాకు దొరకడం ఇదే తొలిసారి కాబట్టి. ముంబయి ఎయిర్ పోర్ట్ దీనికి వేదికగా మారింది. మొత్తమ్మీద ఇన్నాళ్లూ తెరవెనక ప్రేమాయణం సాగించిన ఈ జంట ఇప్పుడిప్పుడే మీడియా ఎటెన్షన్ లోకి వచ్చింది. వీళ్లిద్దరి ప్రేమకథ ఏ తీరానికి చేరుతుందో చూడాలి.రీసెంట్ గా ఇందూకీ జవానీ సినిమాలో నటించింది కియరా అద్వానీ. ప్రస్తుతం ఆమె చేతిలో 2 సినిమాలున్నాయి. అటు సిద్దార్థ్ కూడా బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.