కేజీఎఫ్ 2 టీజ‌ర్ ముహూర్తం ఖరారు.!

కన్నడ కథానాయకుడు యష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా‌ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంకు సంబంధించిన  క్రేజీ అప్‌డేట్ జ‌న‌వ‌రి 8న రానుంది. ఉద‌యం 10.18ని.ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ కొద్దిసేప‌టి క్రితం ప్ర‌క‌టించారు.  టీజ‌ర్ కోసం దేశమంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది. కేజీఎప్ 2 చిత్రాన్ని వారాహి చలన చిత్రం తెలుగులో విడుదల చేస్తోంది.  రాఖీ భాయ్‌గా యష్‌ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో…దానిని ఢీకొట్టేలా సంజయ్‌దత్‌ పోషించిన అధీర పాత్ర ఉంటుంది’ అని నిర్మాత తెలిపారు. శ్రీనిధిశెట్టి, ప్రకాష్‌రాజ్‌, ఆనంత్‌నాగ్‌, రావు రమేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  బ‌స్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎలాంటి సంచ‌ల‌నాలు లేకుండా విడుద‌లైన కేజీఎఫ్ చిత్రం రూ. 200 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టి చరిత్ర సృష్టించ‌డంతో ఇప్పుడు కేజీఎఫ్ 2 పై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి.