కన్నడ హీరో యశ్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్ 1. అయితే ఈ చిత్రంలో నటించిన కన్నడ యాక్టర్ రామ్‌చంద్రరాజు (రామ్) గురించి చాలా మందికి తెలియదు. కేజీఎఫ్ చాఫ్టర్ 1లో రామ్ విలన్ గరుడగా కనిపించాడు. రామ్ ఒకప్పుడు యశ్ కు బాడీగార్డు. రామ్ లుక్స్, ఫర్ ఫార్మెన్స్ ను గమనించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అతడికి విలన్ గా అవకాశమిచ్చాడు. యశ్ బాడీగార్డు ఇపుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగులో చేస్తున్న సినిమాకు సంబంధించిన త్వరలో అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేయనున్నాడు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రామ్.అయితే తన పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ యాక్టర్ ఇప్పటికే కార్తీ-రష్మిక కాంబినేషన్ లో వస్తోన్న సుల్తాన్ తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మొత్తానికి రాబోయే కాలంలో రామ్ నుంచి తెలుగు ప్రేక్షకులను అలరించడం ఖాయమని తెలుస్తోంది.
