దయచేసి పుకార్లను నమ్మొద్దు

కరోనా సెకండ్‌ వేవ్‌తో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. మరికొందరు మాత్రం ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ కోవలోనే కీర్తీ సురేష్‌ నటించిన లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘గుడ్‌లక్‌ సఖి’ కూడా ఓటీటీలో రిలీజ్‌ కానుందనే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రబృందం స్పందించి, ‘‘మా సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తాం.

దయచేసి పుకార్లను నమ్మొద్దు’’ అని స్పష్టం చేసింది. కీర్తీ సురేష్‌ టైటిల్‌ పాత్రలో, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ‘దిల్‌’ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి, శ్రావ్యా వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదల వాయిదా పడింది.