సేతుపతి సరసన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ సేతుపతి సరసన నటిస్తున్న ఈ సినిమాకు మొదటి నుంచి ప్రచారంలో ఉన్న ‘మెర్రీ క్రిస్మస్​’ అనే టైటిల్‌నే ఖరారు చేసినట్లు నిర్మాత రమేష్‌ తౌరుని వెల్లడించారు. ఇక ఈ మూవీ అనౌన్స్‌ చేసిన నాటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్‌ సేతుపతి- కత్రినా మొదటిసారి నటిస్తుండటంతో మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

‘అంధదూన్’ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే ఈ సినిమా షూటింగ్‌ జరగాల్సి ఉండగా కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే జూన్‌లో షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోనే అతి కొద్ది తారాగణంతో షూటింగ్‌ చేయాలని భావిస్తున్నారట. దీంట్లో విజయ్‌ సేతుపతి, కత్రినా సహా మరికొద్ది మంది పాల్గొనున్నట్లు సమాచారం.