ప్రబాస్‌ సరసన కత్రినా కైఫ్‌

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సాహో సినిమా నుంచి ఫుల్‌ జోష్‌లో కనిపిస్తున్నాడు. వయసు దాటి పోతున్నా పెళ్లి విషయాన్ని పక్కనపెట్టి వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించే సినిమాల్లో బాలీవుడ్‌ గ్లామరే ఎక్కువ కనిపిస్తోంది. సాహో, ఆర్‌ఆర్‌ఆర్‌, ఆదిపురుష్‌, నాగ్‌ అశ్విన్‌ మూవీ.. ఇలా అన్నిచిత్రాల్లో మొత్తం బీటౌన్‌ భామల సందడే నెలకొంది. ఇక తాజాగా ‘వార్’ వంటి యాక్షన్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌కు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోనూ మరో బాలీవుడ్‌ బ్యూటినే ప్రభాస్‌ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది.

అప్పట్లో వెంకటేష్‌ నటించిన మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్‌ తరువాత బాలీవుడ్‌లో బిజీగా మారింది. మళ్లీ చాలా ఏళ్లకు తెలుగు వెండితెరపై కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్‌-ఆనంద్‌ సినిమాలో కత్రినాను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు సమాచారం. ప్రబాస్‌ ఎత్తుకు కత్రినా సెట్‌ అవుద్దని వీరిద్దరి జోడి కూడా బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్‌ కత్రినాను సంప్రదించినట్లు, ఇందుకు ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు వినికిడి.

శ్రద్ధా కపూర్.. కృతి సనన్ తరువాత ప్రభాస్ సరసన కత్రినా కనువిందు చేయనుందన్న మాట.ప్రస్తుతం సిద్ధార్థ్ షారూఖ్ ఖాన్, దీపికతో ‘పఠాన్’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ సినిమా చేయనున్నాడు. అయితే ‘రాధేశ్యామ్’ పూర్తి చేసిన ప్రభాస్ ఆ తర్వాత ‘ఆదిపురుష్‌’తో పాటు నాగ్అశ్విన్‌ సినిమా, ప్రశాంత్ నీల్ ‘సలార్’ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా మొదలు కానుంది. కాగా నాగ్ అశ్విన్ సినిమాలో దీపిక పడుకొనె, ‘సలార్’లో శ్రుతి హాసన్, ‘ఆదిపురుష్‌’లో కృతి సనన్ కథానాయికలుగా నటించబోతున్నారు.