కంగనా రనౌత్‌ కీలయ నిర్ణయం

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ కీలయ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెండితెరపై ప్రేక్షకులకు వినోదం పంచిన ఈ ఫైర్‌బ్రాండ్‌.. త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆమెకు జాతియ అవార్డు తెచ్చిపెట్టిన ‘మణికర్ణిక’ చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం. అయితే తొలి యత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీని కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా ‘టికు వెడ్స్ షేరు’ పేరుతో సినిమా తీయబోతున్నట్టు ట్వీటర్‌ వేదికగా కంగనా వెల్లడించింది. అలాగే తన ప్రొడక్షన్ హౌస్ లోగోను శనివారం ఆమె ఆవిష్కరించింది.

ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు తమకు ఆశీర్వదించాలని ఆమె కోరింది. ‘టికు వెడ్స్ షెరు సినిమాతో మణికర్ణిక ఫిలిమ్స్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది ఒక సెటైరికల్ కామెడీతో కూడిన ప్రేమ కథ. కొత్త రకం వినోదాన్ని ఈ సినిమా ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాక, మా ప్రొడక్షన్ సంస్థ నుంచి కొత్త టాలెంట్‌ని, కొత్త కాన్సెప్ట్‌లని పరిచయం చేస్తాము. సాధారణ సినిమాలు చూసే ప్రేక్షకుల కంటే.. డిజిటల్ సినిమాలు చూసే ప్రేక్షకులు కాస్త పరిణితి చెందిన వాళ్లు అని మా భావన’’ అని కంగనా తెలిపింది. ఇదిలా ఉంటే… కంగనా రనౌత్ నటించిన జయలలిత బయోపిక్ ‘తలైవి’ విడుదలకు సిద్ధంగా ఉంది.