ఆట నాది – కోటి మీది

వెండితెర‌పై అల‌రిస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర‌పై స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే  బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మంతో అల‌రించిన ఎన్టీఆర్ ఇప్పుడు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అనే కార్య‌క్ర‌మం మాదిరిగా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే షో చేస్తున్నాడు. ఇప్పటికే అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో ప్రోమో షూట్ ఎన్టీఆర్ కంప్లీట్ చేయగా.. దర్శకుడు త్రివిక్రమ్ ఈ ప్రోమోకి డైరెక్షన్ చేశారు.  తాజాగా ఎన్టీఆర్ ప్రోమో విడుద‌లైంది. ఇది షోపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. అమితాబ్ బచ్చన్ చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి కార్య‌క్ర‌మం దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొంద‌డంతో ఇప్పుడు ఆ షో మాదిరిగా అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో కార్య‌క్ర‌మాన్ని రూపొందిస్తున్నారు. తొలి సారి   తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో నాగార్జున ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేశారు.  2014 జూన్‌లో  ప్రారంభమై సూపర్ సక్సెస్ గా నిలిచిన ఈ షో అదే ఏడాది డిసెంబర్‌లో  రెండో సీజన్ కూడా జ‌రుపుకుంది. 2015 నవంబర్‌లో మూడో సీజన్‌ను ప్రసారం చేశారు. ఈ మూడు సీజన్లకు అక్కినేని నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం. 2017లో ప్రసారమైన నాలుగో సీజన్‌ను మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు.