రాధేశ్వామ్ రిలీజ్ డేట్ ఫిక్స్?

టాలీవుడ్ లో అన్ని సినిమాల డేట్ లు దాదాపుగా వచ్చేసాయి. ఇప్పుడే షూట్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు సర్కారువారి పాట సినిమాతో సహా. డేట్ లు రాని సినిమాలు బహుశా రెండే రెండు.  ఒకటి ప్రభాస్ ‘రాథేశ్వామ్’. రెండు పూరి జగన్నాధ్ లైగర్ సినిమా. సోషల్ మీడియాలో రాధేశ్వామ్ సినిమా వ్యవహారంపై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఇంకా స్టార్ట్ కాని సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలకు విపరీతంగా అప్ డేట్ లు ఇస్తున్నారు కానీ రాథేశ్వామ్ వ్యవహారమే లేదు. కనీసం ఫలానా నెల అని కూడా ప్రకటన లేదు. దీని మీద ఫ్యాన్స్ విపరీతంగా మండి పడుతున్నారు. పీఆర్ టీమ్ ను ఓ లెక్కలో ట్రోల్ చేస్తున్నారు.ఇలాంటి నేపథ్యంలో రాధేశ్యామ్ కూడా డేట్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. వాస్తవానికి షూటింగ్ దాదాపు అయిపోయినా, ఈ సినిమాలు విపరీతంగా సిజి వర్క్ వుంది. అదే అతి పెద్ద సమస్య. అది ఎప్పుడు రెడీ అవుతుందో తెలియదు. పైగా బాలీవుడ్ లో కూడా డేట్ చూసుకోవాలి.ప్రస్తుతం మూడు డేట్ల ను రాధేశ్వామ్ యూనిట్ పరిశీలిస్తోంది. ఈ మూడింటిలో ఒకదాన్ని వీలయినంత త్వరలో అకేషన్ చూసి ప్రకటించాలని ఆలోచిస్తున్నారు.