త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ నో?

కేజిఎఫ్ రేంజ్ లో ఓ భారీ యాక్షన్ సినిమా తీయాలని దర్శకుడు త్రివిక్రమ్ అనుకున్నారా? కానీ దానికి హీరో ఎన్టీఆర్ నో అన్నారా?  ఈ మేరకు ఓ గ్యాసిప్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ప్లానింగ్ లో వుంది.  ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ చెప్పిన రెండు ఆలోచనలు వీటో అయిపోయినట్లు తెలుస్తోంది.మొదటి ఆలోచన, మంత్రిగారి వియ్యంకుడు రీమేక్. ఎప్పడో బాపు డైరక్షన్ లో చిరు చేసిన మంత్రిగారి వియ్యంకుడు సినిమాను ఈ జనరేషన్ కు తగినట్లు తీయాలన్నది త్రివిక్రమ్ ఆలోచన. దానికి ఆయన దగ్గర ప్లాన్ రెడీగా వుంది.కానీ దానికి ఎన్టీఆర్ నో అన్నారని తెలుస్తోంది.దాంతో కేజిఎఫ్ మాదిరిగా భారీ యాక్షన్ సినిమా చేసే ఆలోచన త్రివిక్రమ్ చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఆర్ఆర్ఆర్ తరువాత వెంటనే అలాంటి సినిమా వద్దని, మాంచి ఫ్యామిలీ సినిమా కావాలని ఎన్టీఆర్ అడిగినట్లు తెలుస్తోంది. దాంతో త్రివిక్రమ్ ఇప్పుడు ముచ్చటగా మూడో ఆలోచన చేస్తున్నారని. అది ఎన్టీఆర్ ఓకె అంటే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.ఇదిలా వుంటే మంత్రిగారి వియ్యంకుడు రీమేక్ చేయాలన్న ఆలోచనను మాత్రం త్రివిక్రమ్ వదలడం లేదని తెలుస్తోంది. దాన్నితన డైరక్షన్ లో కాకపోయినా, తన స్క్రిప్ట్ తో వేరే డైరక్టర్-హీరో కాంబినేషన్ లో అయినా తెరకెక్కించాలన్నది త్రివిక్రమ్ ఆలోచనగా తెలుస్తోంది.