బాక్సాఫీస్ దగ్గర బడా విజయం సాధించిన కన్నడ చిత్రం కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ రోజు యష్ బర్త్‌డే సందర్భంగా నిన్న రాత్రి కేజీఎఫ్ 2 చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇది విడుదలైన గంట 52 నిమిషాలలో 10 మిలియన్స్‌కు పైగా వ్యూస్ రాబట్టింది.12 గంటలలో 15 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ని దక్కించుకుంది. టీజర్‌తో సినిమాపై భారీ ఆసక్తిని కలిగించారు కేజీఎఫ్ 2 చిత్ర బృందం. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తికర చర్చలు నడుస్తున్న నేపథ్యంలో చాప్టర్ 2 జూలై 30న విడుదల కానుందనే ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. సౌంత్ ఇండియాకు సంబంధించిన నలుగు భాషలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందులో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరి రావు. అర్చన జాయ్స్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
