“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్” సెకండాఫ్ లో మార్పులు?

అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో గీతా 2 నిర్మిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి తెస్తున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. అయితే అలా ప్రకటించిన సినిమాలు అన్నీ మాట మీద నిలబడలేదు. దానికి కారణం కొంత వరకు ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ కావచ్చు. కనీసం ప్రీ సమ్మర్ రేస్ లోకి రావాలని చూసే ప్రయత్నం అన్నా చేస్తున్నాయి. అందుకు తగినట్లు ఏదో ఒక హడావుడి చేస్తున్నాయి.న్యూ ఇయర్ సందర్భంగా లుక్ లు,  స్టిల్స్ ఇలా ఏదో ఒకటి చాలా వచ్చాయి. కానీ బ్యాచులర్ నుంచి సందడి లేదు. దీనికి వేరే కారణం వుందని తెలుస్తోంది. బ్యాచులర్ సినిమా సెకండాఫ్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం కథ బాగాలేక లేదా బెటర్ మెంట్ కోసం కాదు.ఓ సీరియల్ హీరో తనే స్వంతంగా ఓ సినిమా చేసారు. దాన్ని దిల్ రాజు కాంపౌండ్ లోకి తెచ్చారు. ఆ సినిమా కథతో బ్యాచులర్ కథకు పోలికలు కాస్త గట్టిగా వున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ సంగతి ఆలస్యంగా గమనించడంతో, బ్యాచులర్ కథలో ఆ మేరకు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దొరక్క దొరక్క బొమ్మరిల్లు భాస్కర్ కు ఓ సినిమా దొరికితే, గీతా కాంపౌండ్ లోకి వచ్చాను..హిట్ వస్తుందేమో అని అఖిల్ ఆశపడుతుంటే, ఏమిటో ఈ అవాంతరాలు?