బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు రణ్ బీర్ కపూర్-అలియాభట్ త్వరలోనే వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. బీటౌన్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే పూర్తికావాల్సిన వెడ్డింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే పెండ్లి వేడుకకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ తెరపైకి వచ్చింది. రణ్ బీర్ కపూర్-అలియాభట్ ఎంగేజ్‌మెంట్ ఇవాళ జరుగనున్నట్టు టాక్ నడుస్తోంది. రాజస్థాన్ లోని రత్నంభోర్ లో నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నారన్న వార్త ఇపుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.రణ్ వీర్ సింగ్-దీపికా పదుకొనే దంపతులతోపాటు అలియాభట్ స్నేహితులు రత్నంభోర్ లోని అమన్ హోటల్ కు చేరుకున్నారట. అయితే న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసమే రణ్ వీర్ సింగ్-దీపికా జైపూర్ కు చేరుకున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అలియాభట్ వెడ్డింగ్ అప్‌డేట్ రావడంతో చాలా మంది ఆశ్చర్యానికి లోనవుతున్నారని టాక్. మొత్తానికి రణ్‌బీర్‌కపూర్-అలియాభట్ ఎంగేజ్ మెంట్ న్యూస్ ఎంతవరకు వాస్తమనేది తెలియాలంటే మరో అప్‌డేట్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.ప్రస్తుతం అలియాభట్ లీడ్ రోల్ లో గంగూబాయ్ కథియావాడి సినిమా చేస్తోంది. దీంతోపాటు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో సీత పాత్ర పోషిస్తుంది. సంజయ్ దత్ తో కలిసి నటిస్తున్న షంషేరా షూటింగ్ ను రణ్ బీర్ కపూర్ పూర్తి చేశాడు. మరోవైపు బ్రహ్మాస్త్ర చిత్రంలోనూ నటిస్తున్నాడు.
