ఎన్టీఆర్ పెట్టుకున్న మాస్క్ ధరెంతో తెలుసా?

సెల‌బ్రిటీలు వేసుకునే బ‌ట్ట‌లు, షూస్‌తో పాటు వారి కూలింగ్ గ్లాసెస్‌, వాచెస్ ఇలా అన్నింటిపై  అభిమానుల దృష్టి ఉంటుంది. ఆస‌క్తిగ‌ల కొంద‌రు అభిమానులు కంపెనీ పేరు చూసి వాటిని గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. ఆ ధర చూడ‌గానే వారికి గుండెల్లో గుబులు పుడుతుంది. తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్.. సుకుమార్ కూతురి సారీ ఫంక్ష‌న్‌కు హాజ‌రు కాగా, ఆ స‌మ‌యంలో ముందు మాస్క్‌తో క‌నిపించారు. ఎన్టీఆర్ పెట్టుకున్న మాస్క్ వెనుక చాలా చ‌రిత్ర‌నే ఉంద‌ట‌. అది UA స్పోర్ట్స్ మాస్క్ కాగా,  దాని ధర సుమారు రూ 2340 వ‌ర‌కు ఉంటుంద‌ని అంటున్నారు. ఎన్టీఆర్ ధ‌రించిన‌ మాస్క్‌కు ఇప్పుడు ఫ్రీ ప్ర‌మోష‌న్ లభించ‌డంతో కంపెనీ వారు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ మ‌ధ్య జూనియ‌ర్ రాజమౌళి కొడుకు పెళ్లికి 25 ల‌క్ష‌ల వాచ్,  75 వేల ఖ‌రీదు ఉన్న షూస్ ధ‌రించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన విష‌యం తెలిసిందే.