ఈ సినిమాపై భారీ అంచనాలు

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలోని ఓ కీలకపాత్ర పాత్రలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి నటించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో శిల్పాశెట్టి మహేష్‌కు పిన్ని పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

గతంలోనూ త్రివిక్రమ్‌ తన సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం సీనియర్‌ స్టార్‌ హీరోయిన్లను తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అలా నదియా, ఖుష్బూ, స్నేహ వంటి హీరోయిన్లు త్రివిక్రమ్‌ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28లో శిల్పాశెట్టి అయితే బావుంటుందని అభిప్రాయపడుతున్నారట. ఇక ఈ మూవీకి ‘పార్ధు’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంది. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంతో మహేష్‌ బాబు ‘సర్కారు వారి పాట’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తవగానే త్రివిక్రమ్‌తో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.