బాలయ్యతో ఏ హీరోయిన్ సినిమా చేసినా బరువు పెరగడం ఖాయం:నటి తనుశ్రీ దత్తా

సీనియర్ నటుడు నానా పటేకర్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి సంచలనానికి తెరతీసిన నటి తనుశ్రీ దత్తా. తనకొచ్చిన ఇనిస్టెంట్ గుర్తింపుతో, ఇప్పుడీ బెంగాలీ భామ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె కన్ను టాలీవుడ్ పై పడింది.బాలీవుడ్ కంటే కంటెంట్ పరంగా టాలీవుడ్ చాలా ఎత్తులో ఉందంటోంది తనుశ్రీ దత్తా. తనకు స్టార్ డమ్ వచ్చింది తెలుగు సినిమాలతోనే అని ప్రకటించుకుంది. మంచి రోల్స్ వస్తే టాలీవుడ్ లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా, కంటెంట్ బాగుంటే విలన్, వదిన పాత్రలు చేయడానికి కూడా తనకు అభ్యంతరం లేదంటోంది.ఈ సందర్భంగా బాలయ్యతో తన వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది తనుశ్రీ. బాలయ్యతో ఏ హీరోయిన్ సినిమా చేసినా బరువు పెరగడం ఖాయం అంటోంది. 15 ఏళ్ల కిందట బాలకృష్ణతో కలిసి వీరభద్ర సినిమా చేసింది తనుశ్రీ. ఆ సినిమా టైమ్ లో బాలయ్యతో పాటు యూనిట్ అంతా తనను బాగా చూసుకున్నారని.. ఆ టైమ్ లో చాలా రుచులు ట్రై చేశానని చెప్పుకొచ్చింది.అలా షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి అమాంతం 5 కిలోల బరువు పెరిగానని చెప్పుకొచ్చింది తనుశ్రీదత్తా. పెరిగిన బరువును తల్లిదండ్రులకు చూపిస్తూ.. టాలీవుడ్ లో ప్రేమ ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పుకొచ్చిందట.ఇలా టాలీవుడ్ ను, తెలుగు హీరోల్ని ఓ రేంజ్ లో కాకా పడుతున్న ఈ భామ.. మంచి ఆఫర్లు కోసం వెయిటింగ్. అయితే కాస్టింగ్ కౌచ్ తో బాలీవుడ్ ను బాగా కెలికేసిన ఈ భామకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తాయనుకోవడం భ్రమ. ఇప్పటివరకు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ఏ హీరోయిన్ కు అవకాశాలు రాలేదనే విషయాన్ని ఇక్కడ గమనించాలి.