ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. తాజాగా చేయించుకున్న పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రకుల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని తెలిపింది. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ మధ్య నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండని రకుల్ పేర్కొంది.రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అర్జున్ కపూర్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టుతో బిజీగా ఉంది. ఇటీవలే రకుల్ మాల్దీవులు వెకేషన్ టూర్ లో సరదాగా ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.
